ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలి * సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో సీపీఐ కీలక పాత్ర పోషించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పాలకులు తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అభివృద్ధి, ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు కల్పించడంలో వివక్షత చూపించిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని సీపీఐ జాతీయ సమితి నిర్ణయం చేసి అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సీపీఐ పార్టీ మాత్రమేనని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల ప్రధాన ఏజెండాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం పోరాటాలు జరిగాయని ఆ మహత్తర పోరాటంలో విద్యార్థులు యువకులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన నాటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని అన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014 నుండి 2023 వరకు పరిపాలించారని, పది సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని,నిధులన్నీ కాళేశ్వరం కు మళ్లించారని, ఎన్నో ఆశలతో జీవిస్తున్న నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటం ఆడారని, ఉద్యోగ నియమకాల్లో అనేక అవకతవకలు జరిగాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందారని, రైతుల సమస్యలు పరిష్కరించలేదని, రాష్ట్రంలో నియంతలా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఏకమై నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని వెంకటస్వామి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని, రాష్ట్ర ప్రజలకు కూడు, గుడ్డ, నీడ ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఏ లక్ష్యం కోసం ప్రజలు మార్పు కోరుకున్నారో ఆ దిశగా కాంగ్రెస్ పతిపాలన ఉండాలని లేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి పొరటం చేయడానికి సీపీఐ ముందుంటుందని వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్,కిన్నెర మల్లవ్వ,బీర్ల పద్మ, బ్రాహ్మణపెల్లి యుగేందర్, బూడిద సదాశివ,సీపీఐ నాయకులు న్యాలపట్ల రాజు,కొట్టే అంజలి,సాయవేని రాయమల్లు,రామ్మూర్తి,చిన్న సదాశివ, సాయవేని శ్రీనివాస్, కుమార్,గడవేని రాజయ్య,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు