నాగల్ గిద్ద, మార్చ్ 02 (జాగో న్యూస్): నాగల్ గిద్ద మండలం ఎనాక్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఠలేశ్వర రుక్మిణి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ యువత అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పండరి, గ్రామ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, నాయకులు విట్టల్, పండరీ రెడ్డి, నాగిరెడ్డి, విట్టల్ రెడ్డి తదితరులు ఉన్నారు.









