కరీంనగర్/శంకరపట్నం, మార్చి 02 (జాగో న్యూస్): శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రంగస్థల కళాకారుడు అలివేలు సమ్మిరెడ్డి ఆదివారం మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవా పురస్కార్ 2025 అవార్డును అందుకున్నారు. తెలంగాణ రంగస్థలం కళాకారునిగా అనేక సంవత్సరాలుగా , మరుగున పడ్డ కళలను వెలుగులోకి తెస్తూ ఆయన చేస్తున్న విశేష కృషి కి గానూ దుద్దిల్ల శ్రీపాదరావు సేవ పురస్కార్ కి అలివేలు సమ్మిరెడ్డి ఎంపికయ్యారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ చేతుల మీదుగా అలివేలు సమ్మిరెడ్డి సేవా పురస్కర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అలివేలు సమ్మిరెడ్డి మాట్లాడుతూ ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ పోకార్డ్స్ అకాడమీ అధ్యక్షులు కృపాదానం కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నిష్కలంక రాజకీయ నాయకులు శ్రీపాద రావు పేరిట కలిగిన సేవ పురస్కారాన్ని అందుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మరుగున పడుతున్న కళలను ప్రోత్సహించడానికి మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఎంతో కృషి చేశారని, మారుమూల పల్లెల్లో ఉన్న కళాకారులకు తగిన చేయూతనిచ్చి ప్రోత్సహించారన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు మన మధ్యలో లేకపోయినా ఆయన పేరిట సేవా పురస్కారాలను అందిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.









