కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): నగరంలోని నలభై అయిదవ డివిజన్ సాయినగర్ లో సుడా నిధులు పది లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు గ్రామాలలో అవసరమైన చోట సుడా నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ పిట్టల వినోద శ్రీనివాస్, డిఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









