ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో పురోగతి సాధించిన కరీంనగర్ జిల్లా *రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): సమీక్ష సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదికలు పరిశీలించానని, ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సమస్యలపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో, ఉద్యోగుల పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్ పాటించాలని అన్నారు. అధికారులు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతినెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ భూముల సమస్యలు భూమాత పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు