కరీంనగర్: గత నెలలో చండీగర్ లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ.సిపిఐ జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటి సారి కరీంనగర్ జిల్లా కు వచ్చిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డిని, ఎం.ఎల్.సి నెల్లికంటి సత్యం ను సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో పాటు పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు మరియు ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పల్లా వెంకటరెడ్డి వెంకటరెడ్డి తో పాటు నెల్లికంటి సత్యంను శాలువాతో సత్కరించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. పల్లా వెంకటరెడ్డి గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు అంచలంచలుగా ఎదిగి నేడు తెలంగాణ రాష్ట్ర నుండి సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికవ్వడం రాష్ట్ర సిపిఐ శ్రేణులందరికీ సంతోషదాయకమని, ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎంతోమంది యువతకు ఆదర్శ ప్రాయమని పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి,నాగెల్లి లక్ష్మారెడ్డి,పిట్టల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బామండ్లపెల్లి యుగేందర్, కంది రవీందర్ రెడ్డి మచ్చ రమేష్,పిట్టల శ్రీనివాస్,బూడిద సదాశివ,రామారాపు వెంకటేష్, నాయకులు కేశబోయిన రాము, నల్లగొండ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.









