నష్ట పరిహారం విషయంలో మోసం చేయవద్దు.. *పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయాలి *తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు.

కరీంనగర్/తిమ్మాపూర్: మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి నష్టపోయిన వరి తో పాటుగా ఆరుతడి పంటలు, కూరగాయ పంటలకు కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగినందున ఆయా రైతులకు సంబందించిన పూర్తి వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించాలని తహసీల్దార్ ను కోరారు.ఇంకా ప్రారంభం కానీ చోట కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబించాలని కోరారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.తుపాన్ తాకిడికి నష్టపోయిన పంటలకే కాకుండా పశు నష్టం, ఆస్తి నష్టం జరిగిన వారికి కూడా పరిహారం అందివ్వాలని కోరారు. గతం లో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇస్తామన్నటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మరోసారి అలాంటి మోసం చేయవద్దని వేడుకున్నారు. 30వేల పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం సరిపోదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నష్ట పోయిన రైతాంగాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. మండలం లో జరిగిన నష్టం పై సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నష్టపరిహారం వెంటనే అందేలా కృషి చేయాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్,చింతం శ్రీనివాస్,మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి,మూడం శ్రీలత,ఓబీసి మోర్చా జిల్లా నాయకులు, తాళ్లపెల్లి రాజు, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, వేల్పుల ఓదయ్య, ఉప్పులేటి జీవన్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి,కోతి రాజు, దుర్గుంటి శేఖర్ రెడ్డి,ఎడ్ల భూం రెడ్డి,సిద్ద శ్రీనివాస్, రేగూరి సుగుణాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు