కరీంనగర్: ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పతాకాన్ని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కార్మికులకు అండగా నిలిచేందుకు 1920 సంవత్సరంలో బొంబాయి నగర నడి సముద్రంలో రహస్యంగా పడవలో సమావేశమై ఏఐటియుసి నామకరణం చేసి నేటికీ 106 సంవత్సరాలు అవుతుందని ప్రతి సంవత్సరం ఏఐటియుసి కార్మిక వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతుందని ఆయన అన్నారు. 1920 సంవత్సరంలో ఏఐటియుసి ఏర్పడ్డ నాటి నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్లు పెట్టుకునే హక్కు కావాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచి ప్రమాద నష్టపరిహార చట్టం 1923 26 సంవత్సరంలో ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకునే చట్టం వేతనాల చెల్లింపు చట్టం 1936లో సాధించుకుందని ఆ తర్వాత స్వాతంత్ర భారత దేశంలో పారిశ్రామిక వివాదాల చట్టం కూడా సాధించుకుంన్నా మని, 1947లో పిఎఫ్ చట్టం, 1952లో ప్రయోజన చట్టం, 1961 బోనస్ ల చట్టం, 1965 కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చట్టం, 1970 భవన నిర్మాణ సంక్షేమ చట్టం, 1996 సంవత్సరం ఉపాధి హామీ చట్టం 2005 వీటితోపాటు 44 కార్మిక చట్టాలను ఏఐటిసి అగ్రభాగా నిలబడి పోరాటాల ఉద్యమాలు చేయడం ద్వారా సాధించుకో గలమని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాక బడా పారిశ్రామిక వేతలకు లాభాలు చేకూర్చేందుకు 29 చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తేవడం జరిగిందని వీటిని రద్దు చేయాలని పాత పద్ధతి ప్రకారమే చట్టాలను పునరుద్ధరించాలని, దేశంలో నూతన పరిశ్రమలు వెంటనే నెలకొల్పాలన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలనుండిన భారతదేశ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదని తెల్లదొరలు పోయి నల్ల దొరలు వచ్చిన కార్మిక వర్గానికి ఒరిగేది ఏమీ లేదని నేడు 13 వేల కోట్ల మంది ఒక పూట తిండికి నోచుకోని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎన్డీఏ కూటమిని బొంద పెట్టేందుకు ప్రభుత్వo అవలంబిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. రానున్న కాలంలో కార్మిక లోకం కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షులు జంగా తిరుపతి, కార్యదర్శి కడారి బీరయ్య, పిట్టల సమ్మయ్య కార్యవర్గ సభ్యులు కేంసారం శ్రీనివాస్, గుర్తురి శ్రీనివాస్,పిట్టల శ్రీనివాస్, నాయకులు నన్నవేని కొమురయ్య, రేగుల కుమార్ పైడిపల్లి రాజు,అల్లెపు బాలయ్య,జక్కుల ఆగయ్య, నడిగడ్డ సంపత్,బి యుగేందర్ రాజేందర్, బుచ్చయ్య, భాగ్య భాగ్య, ఆంజనేయులు, సాంబయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.









