నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

కరీంనగర్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో దేశంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని ఆనాడే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పథకం కొనసాగుతుందని అన్నారు. దేశ సమైక్యత కోసం పాటు పడిన ఇందిరాగాంధీ కొన్ని దుష్ట శక్తులకు బలి కావలసి వచ్చిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులమై పని చేయాలని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్,పులి ఆంజనేయులు గౌడ్,చర్ల పద్మ,ఎండి చాంద్, బొబ్బిలి విక్టర్,దండి రవీందర్,అహ్మద్ అలీ, అష్రాఫ్, వంగల విద్యా సాగర్,చింతల కిషన్, రాజిరెడ్డి, షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, బషీర్, భారీ, హసీనా,శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు