హుజురాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో pcpndt యాక్ట్ పై అవగాహన

కరీంనగర్/హుజూరాబాద్: బేటి బచావో బేటి పడావో పథకంలో భాగంగా హుజురాబాద్ మున్సిపల్ ఆఫీస్ నందు pcpndt act అవగాహనకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నోడల్ ఆఫీసర్ బి బి స్కీమ్ డాక్టర్ అశ్విని తానాడే వాకాజీ మాట్లాడుతూ pcpndt ఆక్ట్ గురించి ఎక్కువగా అవగాహన కార్యక్రమాల్లో నిర్వహించి గర్భస్థ ఆండ శిశు మరణాలని తగ్గించాలని మరియు డేగ ఆపరేషన్ ఎక్కువగా నిర్వహించాలని, మొదటి బిడ్డగా ఆడపిల్ల జన్మించి రెండవసారి గర్భం దాల్చిన మహిళలకు ఆడ మగ మధ్య లింగ భేదాలు లేకుండా ఉండాలి అనే విషయాలను అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, డి ఎం అండ్ హెచ్ ఓ. వెంకటరమణ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు