కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశ సైనిక శక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కరీంనగర్ బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓవర్గం ఓట్ల కోసం మన దేశాన్ని మన సైనికులను ఘోరంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి ఇండియన్ ఆర్మీ పై వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఆపరేషన్ సింధూర్, ఇండియన్ ఆర్మీ ని అవమానించే రీతిలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గిల రమేష్, వసల రమేష్, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బల శ్రీనివాస్, కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్,అనూప్,బండ రమణ రెడ్డి,మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ,మైనార్టీ మోర్చా నాయకులు మహమ్మద్ ముజ్జీబ్,పర్వేజ్, బల్బీర్ యువమోర్చ నాయకులు మునిగంటి కుమార్, గుండరపు సంపత్, ఉప్పరపెల్లి శ్రీనివాస్, సింగ్,ఎర్రోళ్ల ప్రదీప్ కుమార్, హరిప్రసాద్, పదం శివరాజ్,బండారు గాయత్రి, కొత్తపల్లి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి, ఆనంద్, ప్రశాంత్,కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు ముత్తునూరి హరీష్, చాడ ఆనంద్,అనుముల సంపత్, ప్రవీణ్, సాయి, కొడిత్యాల సురేష్, మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.








