కరీంనగర్/హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆ దిశగా తగిన చర్యలు చేపట్టారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బిజెపి శ్రేణులతో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నీ బిజెపి ఆధ్వర్యంలో సందర్శించిన సమయంలో ఇక్కడి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యులు తెలియజేశారని, ఆ సమస్యలను బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నేడు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక కోటి 50 లక్షలు సి ఎస్ ఆర్ నిధులతో15 రకాల అవసరమైన వైద్య పరికరాలను , సామాగ్రిని అందించారని తెలిపారు. సోమవారం రోజున హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బిజెపి శ్రేణులతో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల విలువైన వైద్య పరికరాలు సామాగ్రిని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి హుజురాబాద్ బిజెపి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడి ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైందని , అలాంటి ఆసుపత్రి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు కేటాయించినందున, అక్కడి ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంతానికి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తరలిస్తే హుజురాబాద్ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా హుజురాబాద్ మీదుగా వెళుతున్న నేషనల్ హైవే ప్రయాణికులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రాంతంలోని పేద మధ్యతరగతి ప్రజల ను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సేవలు అందించడానికి , రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నీ హుజురాబాద్ కు తరలించే విషయంలో కూడా ఆలోచన చేసి , ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ళ వెంకట్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ బిజెపి సీనియర్ నాయకులు యాంసాని శశిధర్ సబ్బని రమేష్ యాళ్ల సంజీవ్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కొండాల్ రెడ్డి కొలిపాక వెంకటేష్ మహిళ మోర్చా అధ్యక్షురాలు వొడ్నాల చంద్రిక పల్లె వీరయ్య తాళ్లపల్లి దేవేంద్ర తాళ్లపల్లి హరీష్ తూర్పాటి రాజశకర్ పర్థం విజయ్ బాబర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

								
															







