బిజెపి నేత మాసం గణేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

కరీంనగర్: 39 వ డివిజన్ బిజెపి నాయకులు, ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి, కంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రోజున డివిజన్లోని వరసిద్ధి కాలనీ లొ శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి గుడి దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ కరీంనగర్ వారి సహకారంతో వైద్య శిబిరాన్ని డివిజన్లోని స్థానిక ప్రజల కోసం చేపట్టారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలతో పాటు, బరువు, బిపి , జి ఆర్ బి ఎస్, ఈసీజీ, 2డి ఈకో, ఉచిత కంటి పరీక్షలు లను నిర్వహించారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు. ఇట్టి ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సునీల్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు , డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు