తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం అందుకున్న కళాకారులకు సన్మానం

కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 04 (జాగో న్యూస్):   మన్నెంపల్లి గ్రామంలో ఇటీవల వరంగల్లో జరిగిన తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం 2026 వరంగల్ లో అందించారు. ఈ కార్యక్రమంలో మన్నెంపల్లి గ్రామానికి సంబంధించిన నాంపల్లి శంకరయ్యకు తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారంతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా శ్రీ చెన్నకేశవ కళాకారుల బృందం మరియు శ్రీ రామ కళారుల బృందానికి 21 మందికి ప్రశంసా పత్రాలు అందించారు. ఇందుకుగాను తిమ్మాపూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ నాంపల్లి శంకరయ్యతో పాటుగా శ్రీ చెన్నకేశవ కళాకారులు మరియు శ్రీరామ కళాకారుల బృందాన్ని అభినందించి గ్రామపంచాయతీ ఆవరణలో వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సునీత అనిల్ గౌడ్  మాట్లాడుతూ మన్నెంపెల్లి గ్రామాన్ని అన్ని వేదికలలో గ్రామ పేరును ముందుకు తీసుకెళుతున్న గ్రామ కళాకారుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ముందు ముందు కూడా మన్నేపల్లి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో పేరు తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూడిద కిషోర్,వార్డు సభ్యులు సుధాగోని పరశురాములు, పోతుగంటి రమేష్, దరిపెల్లి రమేష్, దుర్గం జంపయ్య, కారోబార్ సురేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు