రాజన్నసిరిసిల్ల/సిరిసిల్ల,ఫిబ్రవరి07(జాగో న్యూస్): అగ్రహారం ఎస్ఎస్ టి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న తరుణంలో రెండు లక్షల నగదు దొరికినట్లు సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 7:59 గంటలకు, కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, అగ్రహారం వద్ద ఉన్న SST చెక్‌పోస్ట్‌లో వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా AP20 AE 1116 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని చిగురు వినోద్, తండ్రి: లచ్చయ్య, నివాసం: ఎదురుగట్ల గ్రామం వేములవాడ మండలం అనునతడు తన కారులో లెక్కలలో లేని అనుమానాస్పదమైన నగదు రూ. 2,00,000/- (రూపాయలు రెండు లక్షలు) తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇతను సిరిసిల్లకు వెళుతున్నట్లు తెలిపినాడు. ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు మరియు చట్టపరమైన విధానాల ప్రకారం, SST బృంద ఇన్చార్జ్ Md సర్దం హుస్సేన్ Jr.Asst పంచుల సమక్షంలో (పంచనామా సాక్షుల) స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం మరియు ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ / దర్యాప్తు కొనసాగుతోందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K. కృష్ణ తెలిపినారు.









